Thursday, September 10, 2026
Homeమేడ్చల్ జిల్లాఘనంగా కాళోజీ జయంతి వేడుకలు..! మేడ్చల్‌...

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు..! మేడ్చల్‌ కలెక్టరేట్‌లో నివాళులు

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : తెలంగాణ ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.కాళోజీ నారాయణరావు చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్య సేవలు, తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక చైతన్యం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) విజయేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌. మాలతి, జిల్లా సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి కేవీవీ సీతారాం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!