Wednesday, September 9, 2026
HomeతెలంగాణGHMCమల్లారెడ్డి, సీఎంఆర్ విద్యాసంస్థల్లో జేఎన్‌టీయూహెచ్ అధికారుల...

మల్లారెడ్డి, సీఎంఆర్ విద్యాసంస్థల్లో జేఎన్‌టీయూహెచ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా :

మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కళాశాలల అకడమిక్, పరిపాలనా రికార్డులతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.తనిఖీలు కొనసాగుతున్న సమయంలో కళాశాల ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం.అయితే, ఈ తనిఖీలకు గల కారణాలపై జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తనిఖీల అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!