Thursday, September 10, 2026
Homeతెలంగాణవిద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలే లక్ష్యం సెయింట్...

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలే లక్ష్యం సెయింట్ అన్నా హైస్కూల్‌లో స్కూల్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ సెయింట్ అన్నా హైస్కూల్లో కొత్తగా ఎన్నికైన స్కూల్ క్యాబినెట్ లీడర్ల ప్రమాణ స్వీకార (అపాయింట్‌మెంట్ డే) వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాఘవేంద్ర గౌడ్, హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోర్ట్స్ కెప్టెన్‌తో పాటు వివిధ హౌస్ లీడర్లకు బ్యాడ్జీలు ధరింపజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలపై అవగాహనతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. లీడర్లుగా ఎన్నికైన విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, క్రీడలు, సేవా కార్యక్రమాల్లోనూ ముందుండి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థి దశలోనే సేవాభావం, నాయకత్వం, బాధ్యతాయుత వైఖరిని అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని నిర్వహించిన సెయింట్ అన్నా హైస్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!