Monday, November 23, 2026
Homeమేడ్చల్ జిల్లామేడ్చల్ సర్కిల్‌కు రూ.5.37 కోట్ల నిధులు

మేడ్చల్ సర్కిల్‌కు రూ.5.37 కోట్ల నిధులు

📰 Generate e-Paper Clip

19 డ్రైనేజీ అభివృద్ధి పనులకు ప్రత్యేక అనుమతులు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సర్కిల్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు మరో ముందడుగు పడింది. సర్కిల్‌-60 పరిధిలో మురుగునీటి పారుదల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రూ.5.37 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 19 డ్రైనేజీ అభివృద్ధి పనులకు సీఎంసీ కమిషనర్ ప్రత్యేక పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. మొత్తం రూ.537.50 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు.ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా పాత డ్రైనేజీ వ్యవస్థలను పునర్నిర్మించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో 200 ఎంఎం, 300 ఎంఎం వ్యాసం కలిగిన SWG పైప్‌లైన్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో 450 ఎంఎం ఆర్‌సీసీ పైప్‌లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. కాలనీలు, ప్రధాన రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రుల పరిసరాల్లో నెలకొన్న మురుగునీటి సమస్యలకు పరిష్కారం చూపేలా పనులకు ప్రాధాన్యత కల్పించారు.ఈ పనులు పూర్తయితే మురుగునీటి పారుదల సమస్యలు తగ్గడంతో పాటు పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడి ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు మేడ్చల్ సర్కిల్-60 డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!