Sunday, September 13, 2026
Homeమేడ్చల్ జిల్లామట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ :ఎమ్మెల్యే...

మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ :ఎమ్మెల్యే మల్లారెడ్డి

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించాలని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. నాగారం డివిజన్‌ రాంపల్లిలో మాజీ కౌన్సిలర్‌ కౌకుట్ల అనంత్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి మాట్లాడుతూ పర్యావరణహితంగా వినాయక చవితిని నిర్వహించడం ద్వారా భావితరాలకు మంచి సందేశాన్ని అందించవచ్చన్నారు. మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న అనంత్‌రెడ్డిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!