Sunday, September 13, 2026
Homeమేడ్చల్ జిల్లాఘటకేసర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రకటన

ఘటకేసర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రకటన

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఘటకేసర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయి కమిటీని డివిజన్‌ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రకటించారు. ఈ సందర్భంగా వజ్రేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడంతో పాటు, కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులతో పాటు డీసీసీ కార్యదర్శి మామిడ్ల ముత్యాలు యాదవ్‌, మాజీ సొసైటీ బ్యాంకు ఛైర్మన్‌ రామ్‌రెడ్డి, గద్దన్నారం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మచందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు మల్లి పావని, జంగయ్య యాదవ్‌, కడుపుల మల్లేష్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!