ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : మాదాపూర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరి కట్స్ ఫ్రీ లెఫ్ట్ సమీపంలో కారు ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12:20 గంటలకు రాయదుర్గం నుంచి మాదాపూర్ వైపు బొమ్మి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తన భార్య వసుంధరతో కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై వెళ్తున్నారు. గోదావరి కట్స్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ఇండికా కారు బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డికి ఎడమ భుజం, మోచేయి, కాలికి తీవ్ర గాయాలు కాగా, ఆయన భార్య వసుంధరకు చెవి, కాలికి గాయాలయ్యాయి. ప్రమాదంలో బైక్, మొబైల్ ఫోన్, ముందు వెళ్తున్న మరో కారు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 9న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
