ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో డీ10 విన్నర్ రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యువతిని లైంగికంగా వేధించాడంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 9వ తేదీన రాజుపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసు విషయాన్ని పోలీసులు ఇన్ని రోజులు గోప్యంగా ఉంచడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
