Friday, October 30, 2026
Homeమేడ్చల్ జిల్లాపట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఏఐవైఎఫ్...

పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఏఐవైఎఫ్ ప్రత్యేక కార్యక్రమం

📰 Generate e-Paper Clip

🔸ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత ముందడుగు

🔸అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి: సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు జీ. దామోదర్ రెడ్డి

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పట్టభద్రుల గొంతుకను శాసనమండలిలో బలంగా వినిపించాలంటే అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు జీ. దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈసీఐఎల్‌లోని కమలానగర్ వద్ద ఏర్పాటు చేసిన ఓటరు నమోదు హెల్ప్‌డెస్క్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు ఫారం-18 ప్రతులను అందజేశారు.

ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్యారంగ సమస్యలు, యువత భవిష్యత్తు వంటి కీలక అంశాలపై పట్టభద్రులు తమ గళాన్ని వినిపించేందుకు ఓటు ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య ఆయుధమని పేర్కొన్నారు. ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదని, అది సామాజిక బాధ్యత కూడా అని అన్నారు.

అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా యువత చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఓటరు నమోదుపై నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైన పత్రాలతో ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు సైతం అధికారిక మార్గదర్శకాలను పరిశీలించి తమ ఓటరు నమోదు స్థితిని నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పట్టభద్రుల హక్కుల పరిరక్షణతో పాటు యువతలో ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించడం, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించడం తమ లక్ష్యమని ఏఐవైఎఫ్ నాయకులు తెలిపారు. ఈ దిశగా ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి పట్టభద్రులకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కల్లూరు ధర్మేంద్ర, మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్య ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు గిరిబాబు, శేఖర్, సతీష్‌తో పాటు పట్టభద్రులు సుదర్శన్, అశోక్, సుధీప్, మధు, రవి, రమ్య, కీర్తన, రామారావు, బాషా, తిరుపతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!