Friday, October 30, 2026
Homeమేడ్చల్ జిల్లాడంపింగ్ యార్డ్ తరలింపుపై బీజేపీ వైఖరిని...

డంపింగ్ యార్డ్ తరలింపుపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలి

📰 Generate e-Paper Clip

🔸 రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర – సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధి ఏదీ? – తోటకూర వజ్రేష్ యాదవ్

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపుపై బీజేపీ తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం దమ్మాయిగూడలోని తిరుమల గార్డెన్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన ఈటల రాజేందర్ జవహర్‌నగర్ ప్రజలకు డంపింగ్ యార్డ్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసమే పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సమయంలో డంపింగ్ యార్డ్ తరలింపుపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏళ్లుగా కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటివరకు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉందని పేర్కొంటూ,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు, సహకారం తీసుకురావాల్సిన బాధ్యత ఎంపీగా ఈటల రాజేందర్‌పై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం ఎందుకని నిలదీశారు. జవహర్‌నగర్ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ డంపింగ్ యార్డ్ తరలింపుపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని కోరారు. రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని తోటకూర వజ్రేష్ యాదవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ సభ్యులు, మేడ్చల్ నియోజకవర్గం డివిజన్ల అధ్యక్షులు మున్సిపాలిటీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రజా ప్రతినిధులు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!