Friday, October 30, 2026
Homeఆరోగ్యంఅంబులెన్స్‌లో ప్రసవం.. ఆడపాపకు జన్మనిచ్చిన మహిళ

అంబులెన్స్‌లో ప్రసవం.. ఆడపాపకు జన్మనిచ్చిన మహిళ

📰 Generate e-Paper Clip

🔸సకాలంలో స్పందించిన 108 సిబ్బంది.. తల్లీబిడ్డ సురక్షితంగా ఆస్పత్రికి తరలింపు

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : 108 అంబులెన్స్‌లో ఓ మహిళ ఆడపాపకు జన్మనిచ్చిన ఘటన మేడ్చల్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పస్పుల సునీత, భర్త శంకర్‌ కొంపల్లి నుంచి సీఎంఆర్‌ ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలోని గుండ్లపోచంపల్లి వద్ద ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే ఈఎంటీ నరేష్‌, ఈఆర్‌సీపీ వైద్యురాలు డాక్టర్‌ స్మిత సూచనల మేరకు ప్రసవం చేయగా ఆడపాప జన్మించింది. సునీతకు ఇది మూడో సంతానం కాగా, ఇంతకుముందు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. అనంతరం తల్లీబిడ్డను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి సేవలందించిన 108 అంబులెన్స్‌ పైలట్‌ అశోక్‌, ఈఎంటీ నరేష్‌లను కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!