ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ బాలాజీనగర్‌లోని విఘ్నేశ్వర ఆలయాన్ని ఆదివారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ ఎన్. రవీందర్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మేడ్చల్ అసెంబ్లీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వివిధ డివిజన్లకు కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించారు.మేడ్చల్ డివిజన్ కన్వీనర్‌గా దాత్రిక లక్ష్మణ్, కిష్టాపూర్–పూడూర్ డివిజన్ కన్వీనర్‌గా డి.సి. నర్సింలు, గుండ్లపోచంపల్లి డివిజన్ కన్వీనర్‌గా పి. నాగరాజు, ఎల్లంపేట మున్సిపాలిటీ కన్వీనర్‌గా ఆకుల రమేష్‌ను నియమించారు. ఆయా ప్రాంతాలకు పలువురిని కో-కన్వీనర్లుగా నియమించారు.మేడ్చల్ ఉమ్మడి మండల కో-కన్వీనర్, అసెంబ్లీ కో-కన్వీనర్ చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపట్టారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలు, క్రమశిక్షణ, సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని రవీందర్ గౌడ్ సూచించారు.
