Sunday, September 13, 2026
Homeమేడ్చల్ జిల్లాగణేష్ ఉత్సవాల నిర్వహణకు నూతన కమిటీలు

గణేష్ ఉత్సవాల నిర్వహణకు నూతన కమిటీలు

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ బాలాజీనగర్‌లోని విఘ్నేశ్వర ఆలయాన్ని ఆదివారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ ఎన్. రవీందర్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మేడ్చల్ అసెంబ్లీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వివిధ డివిజన్లకు కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించారు.మేడ్చల్ డివిజన్ కన్వీనర్‌గా దాత్రిక లక్ష్మణ్, కిష్టాపూర్–పూడూర్ డివిజన్ కన్వీనర్‌గా డి.సి. నర్సింలు, గుండ్లపోచంపల్లి డివిజన్ కన్వీనర్‌గా పి. నాగరాజు, ఎల్లంపేట మున్సిపాలిటీ కన్వీనర్‌గా ఆకుల రమేష్‌ను నియమించారు. ఆయా ప్రాంతాలకు పలువురిని కో-కన్వీనర్లుగా నియమించారు.మేడ్చల్ ఉమ్మడి మండల కో-కన్వీనర్, అసెంబ్లీ కో-కన్వీనర్ చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపట్టారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలు, క్రమశిక్షణ, సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని రవీందర్ గౌడ్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!