Sunday, September 13, 2026
Homeమేడ్చల్ జిల్లానాచారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం..! ఉప్పల్...

నాచారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం..! ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : నాచారం డివిజన్‌లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సంపూర్ణ సహకారం అందిస్తానని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.నాచారం డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరమేశ్వర్ రెడ్డిని కలిసి రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పాటు పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నాచారం అభివృద్ధికి సానుకూలంగా స్పందించిన పరమేశ్వర్ రెడ్డికి టీపీసీసీ అధికార ప్రతినిధి హెచ్.ఆర్. మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!