Saturday, September 19, 2026
Homeతెలంగాణహైదరాబాద్నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్...

నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్ ఢీకొట్టి షాపులోకి దూసుకెళ్లిన కారు

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, వెబ్ డెస్క్ : నార్సింగి ప్రధాన రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకెళ్తున్న ఇన్నోవా క్రిస్టా కారు (TS07HA0565) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురు దిశలో ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. దుకాణాలు పూర్తిగా ధ్వంసం కాగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? లేక వేరే కారణం వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!