Saturday, September 19, 2026
Homeమేడ్చల్ జిల్లాగుండ్లపోచంపల్లిలో కొత్త రేషన్‌ స్మార్ట్‌ కార్డుల...

గుండ్లపోచంపల్లిలో కొత్త రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గుండ్ల పోచంపల్లి డివిజన్‌ పరిధిలో అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. వీఆర్వో ప్రభు, రేషన్‌ డీలర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.ఈ సందర్భంగా డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, గౌడవల్లి మాజీ సర్పంచ్‌ గరిసెల సురేందర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. గత కొంతకాలంగా రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కొత్త స్మార్ట్‌ కార్డులు అందించడం సంతోషకరమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో మాజీ సర్పంచులు బండారి నరేందర్‌ ముదిరాజ్‌, బేరి ఈశ్వర్‌, మేడ్చల్‌ జిల్లా ఓబీసీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గువ్వ రవి ముదిరాజ్‌, ఆలయ అధ్యక్షుడు గడిలా కృష్ణారెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బొజ్జ ఆదిలక్ష్మి, జిల్లా మహిళా కాంగ్రెస్‌ కార్యదర్శి మరిలమ్మ, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీరంగవరం నవీన్‌ ముదిరాజ్‌, మాజీ ఎంపీటీసీ పులిగళ్ల రాజేశ్వర్‌, మాజీ ఉపసర్పంచ్‌ చిల్ల వెంకటేష్‌ ముదిరాజ్‌, సేవాదళ్‌ అధ్యక్షుడు చిల్ల సాయి ముదిరాజ్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!