ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : నగరంలో విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. అంతర్రాష్ట్ర ఎండీఎంఏ సరఫరా నెట్‌వర్క్‌పై దాడి చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 14 ఎండీఎంఏ మాత్రలు, 9 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎండీఎంఏ విలువ సుమారు రూ.22,500 ఉంటుందని అంచనా.
గోవా-ముంబై-హైదరాబాద్ లింక్
పోలీసుల కథనం ప్రకారం.. సూర్య గౌడ్ (29) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవాకు చెందిన ‘బాబా’ అనే వ్యక్తి సూచనల మేరకు సూర్య డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 16న ముంబై వెళ్లిన సూర్య, అక్కడ డానిష్ అలియాస్ అన్వారీ నుంచి 29 ఎండీఎంఏ మాత్రలను రూ.22,500కు కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చాడు. ఒక్కో మాత్రను రూ.750కు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. మరో 15 మాత్రలను ‘మున్నా’ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేస్తుండగా ఈగల్ ఫోర్స్ దాడి చేసి పట్టుకుంది.
నెట్‌వర్క్‌పై నిఘా
గోవా-ముంబై-హైదరాబాద్ మధ్య నడుస్తున్న డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగతా వ్యక్తుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
