🔸మేడ్చల్ కోర్టులో 23 కేసుల పరిష్కారం.. రూ.32,100 జరిమానా
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై న్యాయస్థానం కొరడా ఝళిపించింది. మేడ్చల్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో బుధవారం నిర్వహించిన విచారణలో మొత్తం 23 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో రెండు డబ్ల్యూడీఎల్ కేసులు, 21 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో మొత్తం రూ.32,100 జరిమానా విధించారు. డీడీ కేసుల్లో తొమ్మిది మందికి జైలు శిక్ష ఖరారు చేశారు. ఒకరికి మూడు రోజులు, ఐదుగురికి ఐదు రోజులు, మరొకరికి ఏడు రోజులు, ఇద్దరికి పది రోజుల చొప్పున శిక్ష విధించారు.ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ సీఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు సహకరించాలని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
