🔸కుళ్లిన స్థితిలో గుర్తింపు.. మృతిపై అనుమానాలు
🔸హత్యా? ఆత్మహత్యా? పోలీసుల దర్యాప్తు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : కీసర–ఘట్‌కేసర్ ఓఆర్ఆర్ బైపాస్ సమీపంలో ట్రాన్స్‌జెండర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. రాంపల్లి–దాయర–కరీంగూడ పరిధిలోని బ్రిడ్జి కింద ఉరివేసుకున్న స్థితిలో కుళ్లిన మృతదేహాన్ని గుర్తించారు.మృతురాలిని బోగారం గ్రామానికి చెందిన స్వీటీ (శేఖర్)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడించారు.సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మృతికి గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇది ఆత్మహత్యా? లేక మరేదైనా కారణం ఉందా? అన్నది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని కీసర ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.
