🔸మహిళకు తీవ్ర గాయాలు..
🔸సీఎంఆర్ ఆసుపత్రికి తరలింపు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గ్యాస్ లీకేజీ కారణంగా సంభవించిన సిలిండర్ పేలుడు ఓ ఇంటిని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ 21 వ వార్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బండమీది సూర్యారావు ఇంట్లో అద్దెకు ఉంటున్న అంజని (24) ఇంట్లో గ్యాస్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి గోడలు కూలిపోగా, ఇంట్లో ఉన్న అంజనికి మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి.భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల నివాసితులు ఉలిక్కిపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చి, తీవ్రంగా గాయపడిన అంజనిని చికిత్స నిమిత్తం సీఎంఆర్ ఆసుపత్రికి తరలించారు.

