Thursday, November 5, 2026
Homeమేడ్చల్ జిల్లాఅల్వాల్ రైతుబజార్‌ను తొలగిస్తే 1,500 రైతు...

అల్వాల్ రైతుబజార్‌ను తొలగిస్తే 1,500 రైతు కుటుంబాలకు నష్టం!

📰 Generate e-Paper Clip

🔸ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం నేపథ్యంలో రైతుల ఆందోళన

🔸ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి రైతుల జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం అల్వాల్ రైతుబజార్‌ను తొలగించనున్న నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుబజార్‌ను తొలగిస్తే దానిపై ఆధారపడిన సుమారు 1,500 రైతు కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొంటూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మేడ్చల్‌, సిద్దిపేట, మెదక్‌, నల్గొండ జిల్లాల్లోని వివిధ గ్రామాల నుంచి రైతులు ప్రతిరోజూ కూరగాయలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారని తెలిపారు. రోజుకు సుమారు 1,000 నుంచి 1,500 మంది రైతులు ఈ మార్కెట్‌పై ఆధారపడి వ్యాపారం సాగిస్తున్నారని వివరించారు. 1999 జనవరి 26న ప్రారంభమైన ఈ రైతుబజార్‌ గత 26 ఏళ్లుగా రైతులకు జీవనాధారంగా కొనసాగుతోందన్నారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలు విక్రయించే అవకాశం ఈ మార్కెట్‌ ద్వారా లభిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, అయితే రైతుల జీవనోపాధికి విఘాతం కలగకుండా చూడాలని కోరారు. రైతుబజార్‌ను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడితే అల్వాల్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి రైతులకు న్యాయం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్‌ను విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!