ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: గజ్వేల్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు వెళ్తుండగా గజ్వేల్ శివారులో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ముందు సీట్లో ఉన్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలు కాగా, వెనుక సీట్లో ఉన్న కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయ్‌ను ఆపారు. వెంటనే భద్రతా సిబ్బందితో కలిసి కారు వద్దకు పరుగెత్తి బాధితులను బయటకు తీశారు. తన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనంలోనే క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని పోలీసులకు, ఆసుపత్రి వర్గాలకు మంత్రి ఆదేశించారు. మంత్రి సమయస్ఫూర్తి, మానవతా దృక్పథంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గజ్వేల్‌లో కారు బోల్తా: క్షతగాత్రులను కాపాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్
RELATED ARTICLES
