ఆర్ జె న్యూస్,మేడ్చల్ : మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలో శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో ఆదివారం వినాయక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కనుకంటి వెంకటేశం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.కార్యక్రమంలో మాయా కృష్ణ, రజిత, కనుకంటి వెంకటేశం, సంధ్య, గాజుల సారికతో పాటు శివాజీ సేన యూత్ సభ్యులు కనుకంటి శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, సతయ్య సన్స్, హర్షవర్ధన్, వినాయక్, రిత్విక్, బాను, సాయి, సుశాంత్, శివతేజ, సాహిల్, ప్రీహమ్, కార్తిక్, జస్వంత్, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

