ఆర్ జె న్యూస్,మేడ్చల్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ 297 డివిజన్ ఆర్టీసీ కాలనీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శివసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ (RR) ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్న గారి రాఘవేంద్ర గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాఘవేంద్ర గౌడ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివసేన యూత్ అసోసియేషన్ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందించడంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని కొనియాడారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమన్నారు.అనంతరం, 297 డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను రాఘవేంద్ర గౌడ్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని, స్వామివారి కృప అందరిపై ఉండాలని భగవంతుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,ఆర్టీసీ కాలనీ వినాయక కమిటీ సభ్యులు కొండల్ రెడ్డి,సదా నంద రెడ్డి,మధు సుధన్ రెడ్డి,కిష్ణా రెడ్డి, రామారావు,అప్పారావు,అమరనాథ్, నవీన్ రెడ్డి,పవన్ వాసులు మరియు శివసేన యూత్ అసోసియేషన్ సభ్యులు,భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్టీసీ కాలనీలో వైభవంగా గణేష్ అన్నదానం: పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత రామన్నగారి రాఘవేంద్ర గౌడ్
RELATED ARTICLES
