Sunday, September 20, 2026
Homeమేడ్చల్ జిల్లాప్రజా సంక్షేమమే ధ్యేయం.. నియోజకవర్గ అభివృద్ధే...

ప్రజా సంక్షేమమే ధ్యేయం.. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం – ఎమ్మెల్యే వివేకానంద్

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్‌, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ పేర్కొన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్‌లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయక నవరాత్రి వేడుకల పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఉత్సవాల ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన అంశాలను ఆయనతో చర్చించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు అవసరమైన సౌకర్యాల మెరుగుదల తదితర అంశాలపై వినతిపత్రాలను అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎమ్మెల్యే పరిశీలించి, సంబంధిత అంశాలపై చర్చించారు. ప్రజల అవసరాలను తెలుసుకుని, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వినాయక నవరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!