ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : గణేష్ నిమజ్జన విధుల్లో పాల్గొన్న ఓ ఎస్ఐ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకన్న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని ఎన్టీఆర్ మార్గ్, క్రేన్ నంబర్ 2 వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు విధులకు హాజరయ్యారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసు ఉన్నతాధికారుల సూచన మేరకు ఆయనను కొత్తగూడెంలోని నివాసానికి తరలించారు. అయితే శరీరమంతా తీవ్ర నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం వెంకన్న మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
బైక్ ఢీకొని ఎస్ఐ మృతి – నిమజ్జన విధుల్లో విషాదం
RELATED ARTICLES
