Saturday, October 3, 2026
Homeక్రైమ్ న్యూస్క్యాబ్ డ్రైవర్ హత్య కేసు ఛేదించిన...

క్యాబ్ డ్రైవర్ హత్య కేసు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు – ముగ్గురు అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పటాన్‌చెరు పరిధిలో సంచలనం సృష్టించిన క్యాబ్ డ్రైవర్ హత్య, దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. మహారాష్ట్రకు చెందిన ఘోడకే రాహుల్, సూరజ్ శశికాంత్, బాంబ్లే రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘటన వివరాలు :
సెప్టెంబర్ 10 రాత్రి సికింద్రాబాద్ లో నిందితులు క్యాబ్ డ్రైవర్ నెలమర్రి రాజశేఖర్ ను ముంబై వెళ్లాలంటూ మాట్లాడుకున్నారు. మార్గమధ్యంలో రుద్రారం సమీపంలో టవల్ తో గొంతు నులిమి రాజశేఖర్ ను హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని బ్రిడ్జి వద్ద పడేసి, కారుతో ముంబై వైపు పరారయ్యారు. కోహిర్ వద్ద కారు మొరాయించడంతో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. బంగారు దుకాణాల్లో చోరీలకు కారును ఉపయోగించి, అనంతరం కారును విక్రయించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!