ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలు వినూత్నంగా సాగాయి. బౌరంపేటలో గణనాథుడికి హెలికాప్టర్ ద్వారా పూలాభిషేకం చేసి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. బౌరంపేట హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరుగారి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా గణనాథుడిపై పూలవర్షం కురిపించారు. పలు రకాల గణనాథుల విగ్రహాలను ఏర్పాటు చేస్తూ భక్తులు తమ భక్తిని చాటుకుంటుండగా, అందరూ గుర్తుంచుకునేలా తన భక్తిని ప్రదర్శించారు ధర్మారెడ్డి. 2009 నుండి తన మనసులో ఉన్న కోరికను ఈరోజు తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. తనకు సహకరించిన బౌరంపేట గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
గణనాథుడికి హెలికాప్టర్ తో పూలాభిషేకం.. ఆకట్టుకున్న భక్తుడి వేడుక
RELATED ARTICLES
