ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఆర్టీసీ ప్రయాణికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మేడ్చల్ డిపోలో గురువారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ పరిమళ తెలిపారు. మేడ్చల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల రాకపోకలు, బస్సు సౌకర్యాలు, ఇతర ప్రయాణ ఇబ్బందులపై తమ ఫిర్యాదులు, సూచనలను నేరుగా డిపో మేనేజర్‌కు తెలియజేయవచ్చన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఫిర్యాదులు, సూచనల కోసం 9959226152 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించాలని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
