🔸ఎల్లమ్మ, కట్ట మైసమ్మకు రాఘవేందర్ గౌడ్ ప్రత్యేక పూజలు.
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ 297వ డివిజన్ పరిధిలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లమ్మ, కట్ట మైసమ్మ దేవతల పూజా కార్యక్రమంలో ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్న గారి రాఘవేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిత్యం కష్టపడి పనిచేస్తూ ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్న ఆటో కార్మికులు, వారి కుటుంబాలపై ఎల్లమ్మ తల్లి, కట్ట మైసమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

