ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో కాలనీ సంక్షేమ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి మేడ్చల్ సీఐ అంజిరెడ్డి , డివిజన్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
రాఘవేంద్రనగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
RELATED ARTICLES
