Thursday, October 29, 2026
Homeమేడ్చల్ జిల్లాసీఎంఆర్‌సీఈటీలో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు

సీఎంఆర్‌సీఈటీలో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు

📰 Generate e-Paper Clip

రజతోత్సవ వేళ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయలో ఉన్న సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (సీఎంఆర్‌సీఈటీ)లో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల రజతోత్సవ (సిల్వర్‌ జూబ్లీ) వేడుకల నేపథ్యంలో నిర్వహించిన ఈ సంబరాలు విద్యార్థులు, అధ్యాపకుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

సీఎంఆర్‌ విద్యాసంస్థల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి, సీఎంఆర్‌ గ్రూప్‌ సీఈఓ సీహెచ్‌ అభినవ్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దసరా పండుగను పురస్కరించుకొని కళాశాల ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ దుస్తుల్లో పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు సాగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, డీన్‌ (ఫ్యాకల్టీ అండ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌) డాక్టర్‌ నాగరాజు నాయక్‌, ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌s విభాగాధిపతి రోహిణిరెడ్డి, వివిధ విభాగాల డీన్లు, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!