ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో బాణసంచా తాత్కాలిక దుకాణాలను డీసీపీ అడ్మిన్ అన్నపూర్ణ గురువారం తనిఖీ చేశారు. లక్ష్మీనగర్, విశ్వకర్మ కాలనీల్లో ఏర్పాటు చేసిన దుకాణాలను సందర్శించి లైసెన్సులు, అనుమతి పత్రాలను పరిశీలించారు. దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఫైర్ ఎన్ఓసీ, ట్రేడ్ లైసెన్స్ తదితర పత్రాలను తనిఖీ చేశారు. అగ్నిప్రమాదాలు జరగకుండా చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్తలను పరిశీలించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.
బాణసంచా దుకాణాల్లో డీసీపీ ఆకస్మిక తనిఖీలు
RELATED ARTICLES
