🔸రైతులంతా హాజరుకావాలి: తహసీల్దార్ భూపాల్
ఆర్ జె న్యూస్ , మేడ్చల్ : మేడ్చల్ పరిధిలోని ఖాజీగూడ గ్రామంలో శనివారం భూ రీసర్వేపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మేడ్చల్ తహసీల్దార్ భూపాల్ తెలిపారు. ఉదయం 11 గంటలకు గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద కీసర ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. భూ రీసర్వే ప్రక్రియ, విధివిధానాలు, రైతులకు కలిగే ప్రయోజనాలపై అధికారులు అవగాహన కల్పించనున్నారు. గ్రామంలోని రైతులందరూ సదస్సుకు హాజరై భూ రీసర్వేపై వివరాలు తెలుసుకోవాలని తహసీల్దార్ భూపాల్ కోరారు.

