🔸25 ఏళ్ల విద్యా ప్రస్థానానికి ప్రతీకగా ప్రత్యేక లోగో.. ఘనంగా ఆవిష్కరణ
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : విద్యారంగంలో 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (CMRCET) సిల్వర్ జూబ్లీ వేడుకలకు శ్రీకారం చుట్టింది. కళాశాల 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక సిల్వర్ జూబ్లీ లోగోను ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.25 ఏళ్ల విద్యా ప్రస్థానంలో కళాశాల సాధించిన విజయాలు, విద్యార్థులకు అందించిన నాణ్యమైన విద్య, పాటిస్తున్న విలువలు, సమాజానికి అందించిన సేవలకు ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్రతీకగా నిలవనున్నాయి. ప్రత్యేక లోగో ఆవిష్కరణతో రజతోత్సవ సంబరాలకు అధికారికంగా శుభారంభం పలికినట్లయింది.ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, శ్రీశైలం రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, సోదర సంస్థల ప్రిన్సిపాల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ విభాగం ప్రతినిధులతో పాటు ఆర్ట్స్ అండ్ కల్చర్ హెడ్ రోహిణి రెడ్డి పాల్గొన్నారు.
