Thursday, November 26, 2026
Homeమేడ్చల్ జిల్లారోడ్డు భద్రతే.. ప్రాణాలకు రక్ష

రోడ్డు భద్రతే.. ప్రాణాలకు రక్ష

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదాలను నివారించి, విలువైన ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ఘట్‌కేసర్‌ పోలీసులు ‘అరైవ్‌ అలైవ్‌’ పేరుతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి ఆదేశాల మేరకు యంనంపేట్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద ఘట్‌కేసర్‌ ఎస్‌హెచ్‌ఓ కిరణ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వాహనచోదకులు, ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థులు, యువతకు ట్రాఫిక్‌ నిబంధనల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఎస్‌హెచ్‌ఓ కిరణ్‌ మాట్లాడుతూ.. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగించడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించాలని సూచించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలను ఉదహరిస్తూ.. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, బాధిత కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతాయని వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు. ‘మీ భద్రతే మీ కుటుంబానికి భరోసా.. సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకోండి’ అంటూ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కిరణ్‌ వాహనచోదకులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ, ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!