ఆర్ జె న్యూస్, మేడ్చల్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మేడ్చల్‌లో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మేడ్చల్ డివిజన్‌లోని శ్రీరామలింగేశ్వర ఆలయం, పూడూరు కిష్టాపూర్ డివిజన్‌లోని కేఎస్ఆర్ వెంచర్‌లో ఉన్న శివాలయం, అత్వెల్లిలో దక్షిణ కాశీగా పేరొందిన శివాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అత్వెల్లి శివాలయంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేశ్ గౌడ్ ఆకాశదీపాన్ని వెలిగించారు. సాయంత్రం భక్తులు ఆయా ఆలయాలకు చేరుకుని దీపారాధనలు నిర్వహించారు.
