ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పరిధిలోని జయదర్శిని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి పుష్పయాగాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. అన్నమయ్య కీర్తనలకు నృత్యరూపకాలను ప్రదర్శించి భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. ఆలయ మండపంతో పాటు స్వామివారి ఊరేగింపు ముందు విద్యార్థులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
