🔸 సంవిధాన్ రక్షక్ ర్యాలీలో చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ శ్రేణుల భారీ పాల్గొనడం
ఆర్ జె న్యూస్, జవహర్ నగర్ : ఏఐసిసి పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సంవిధాన్ రక్షక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు ముదిరాజ్, సీనియర్ నాయకులు రజిత గోపాల్, ఉపాధ్యక్షులు గోనె చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి మాధవ రెడ్డి, జోగి సునీత, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాహుల్ కదం, నాయకులు సాయి కృష్ణ (మిట్టు), కాలేశా, రామిరెడ్డి, నర్ర మహేష్, భాస్కర్ గౌడ్, రాము, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
