Saturday, August 15, 2026
Homeతెలంగాణహైదరాబాద్ఘనంగా నల్ల పోచమ్మ తల్లి ఊరేగింపు

ఘనంగా నల్ల పోచమ్మ తల్లి ఊరేగింపు

మేడ్చల్ ఆర్ జె న్యూస్ జూలై 3 : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిష్టాపూర్ పూడూరు డివిజన్ లోని కిష్టాపూర్ అర్చన కాలనీలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గురువారం నల్ల పోచమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మశ్రీ సంజయ్ శర్మ ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్తములు వేద మంత్రోచ్చారణలతో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు కాలనీవాసులు స్థానిక నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!