Sunday, August 16, 2026
Homeతెలంగాణహైదరాబాద్భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి...

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ టెలీ కాన్ఫరెన్స్

ఆర్ జె న్యూస్, హైదరాబాద్ : రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ ప్రత్యామ్నాయ ప్రణాళిక, వనమహోత్సవం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పీ లతో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐదు, ఆరు జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా 26 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందన్నారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా జిల్లాల్లో విత్తన మేళాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల విషయంలో ఏవిధమైన సహాయం కావాలన్నా అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని సిఎస్ తెలిపారు.

కాగా, రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో విస్తృత స్థాయిలో కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ (IMD) తాజా సూచనల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.ప్రధానంగా, వివిధ శాఖలతో సమన్వయంతో పని చేయాలన్నారు. భద్రాచలం, ములుగు, నిర్మల్ జిల్లాలలో NDRF బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. హైదరాబాద్, ఇతర ప్రధాన కేంద్రాల్లో ఉన్న NDRF బృందాలను కూడా అవసరం ఉన్న చోటుకు తరలిస్తామన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, కార్యదర్శులు దాసరి హరిచందన, సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!