Sunday, August 16, 2026
Homeక్రైమ్ న్యూస్మేడ్చల్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

మేడ్చల్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : పట్టణంలోని సంతోషిమాత ఆలయం సమీపంలో కటింగ్‌ షాప్‌ నిర్వహిస్తున్న ఓ యువకుడు ఇంట్లో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మెదక్‌కు చెందిన మంగలి సాయిరాం (25) కొంతకాలంగా మేడ్చల్‌లో నివాసముంటున్నాడు.శుక్రవారం రాత్రి ఇంట్లో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయిరాం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటనపై మేడ్చల్‌ పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!