Sunday, August 16, 2026
HomeతెలంగాణGHMCభక్తిశ్రద్ధలతో చండీ హోమం

భక్తిశ్రద్ధలతో చండీ హోమం

మేడ్చల్ ( ఆర్ జె న్యూస్ ) జూలై 5 : సైబరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ కిష్టాపూర్ పూడూర్ డివిజన్ కిష్టాపూర్ అర్చన కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా భక్తిశ్రద్ధలతో చండీ హోమంను నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రెండవ రోజు భాగంగా చండి ఉపాసకులు బ్రహ్మశ్రీ సంజయ శర్మ వైదిక బృందంతో శనివారం ఉదయం 8 గంటల నుండి కర్మణః పుణ్యాహా వాచనం ప్రతిష్ట విగ్రహ ఏకాశితి కలశ స్నపనం చండీ హోమము, భారీ ఎత్తున మహిళలు పాల్గొని శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారికి దాన్యాదివాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.సాయంత్రం 4 నుండి స్థాపిత దేవత హోమాలు ప్రతిష్ట దేవత మూలమంత్ర హోమాలు అనంతరం ఫలాదివాసం, పుష్పాదివాసం, శయ్యాధివాసం హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. నేటి ఉదయాత్ పూర్వము బ్రాహ్మి ముహూర్తం 3:30గంటల నుండి కర్మణః పుణ్యాహా వాచనం, గర్తన్యాసం, బీజన్యాసం, ధాతున్యాసం, 4:50 గంటలకు యంత్రస్ధాపన నల్లపోచమ్మ పరివార, విగ్రహాల ప్రతిష్ట ప్రాణప్రతిష్ట దృక్ బలి, దిక్ బలి, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన సంప్రోక్షణ, శాంతి కళ్యాణం మహానైవేద్యం హారతి మంత్రపుష్పం ఆశీర్వచనం పండిత సన్మానం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న ప్రసాద సంతర్పణ నిర్వహించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కమిటీ సభ్యులు రెడ్డంగారి నవీన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తొంట యాదయ్య, బి జే పి సీనియర్ నాయకులు రాంచంద్రా రెడ్డి లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!