Friday, October 2, 2026
Homeతెలంగాణకేటీఆర్ 50వ జన్మదినం: నిరుపేద విద్యార్థులకు...

కేటీఆర్ 50వ జన్మదినం: నిరుపేద విద్యార్థులకు 50 సైకిళ్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, హైదరాబాద్ :

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కింగ్‌కోటి లోని ఎల్లెన్ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా 50 మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు..ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుకు సైకిల్ ఎంతో ఉపయోగపడుతుందని, కేటీఆర్ స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!