Friday, October 2, 2026
Homeమేడ్చల్ జిల్లాకుత్బుల్లాపూర్‌లో టెక్ మహీంద్రా ముందు ఉద్యోగి...

కుత్బుల్లాపూర్‌లో టెక్ మహీంద్రా ముందు ఉద్యోగి ధర్నా

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, హైదరాబాద్, కుత్బుల్లాపూర్ :

దుండిగల్‌లోని టెక్ మహీంద్రా సాఫ్ట్‌వేర్ కంపెనీ ముందు ఒక ఉద్యోగి శుక్రవారం ధర్నాకు దిగారు. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఆయన నిరసన తెలిపారు. బాధిత ఉద్యోగి భావన మాట్లాడుతూ, తన బిడ్డ అనారోగ్యంతో ఉండడంతో 3 రోజుల సెలవు కోసం యాజమాన్యానికి మెసేజ్ ద్వారా అనుమతి కోరినట్లు తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ నుంచి ఈ-మెయిల్ అందినట్లు ఆరోపించారు. “ఇది పూర్తిగా అన్యాయం. మానవతా దృక్పథంతో కూడా ఆలోచించకుండా ఉద్యోగం నుంచి తీసేశారు. నాకు న్యాయం జరగాలి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై భావన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కంపెనీ ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగిని సంయమనం పాటించాలని సూచించారు. కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై టెక్ మహీంద్రా యాజమాన్యం స్పందన కోసం ప్రయత్నించగా, వెంటనే సమాధానం లభించలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!