ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించిన షిరిడి సాయిబాబా దర్శన కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే శ్రీ చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ప్రార్థించారు.కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు మాజీ మంత్రి మల్లారెడ్డిని శాలువాతో సన్మానించి సాయిబాబా తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి కొద్దిసేపు ముచ్చటించిన ఆయన ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు నవీన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్, నాయకులు మోహన్ రెడ్డి, నాగరాజు ముదిరాజ్, విష్ణుచారి, ఆర్. మల్లికార్జున్, స్వామి, చంద్రశేఖర్, నర్సింగ్ గౌడ్, రఘు, అవతార్, చిన్న నవీన్ యాదవ్, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు
.
