Friday, October 2, 2026
Homeక్రైమ్ న్యూస్అదనపు కట్నం వేధింపుల కేసులో భర్తకు...

అదనపు కట్నం వేధింపుల కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, కీసర : అదనపు కట్నం కోసం భార్యను శారీరక, మానసిక వేధింపులకు గురిచేసి ఆమె అనుమానాస్పద మృతికి కారణమైన భర్తకు న్యాయస్థానం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. కీసర పోలీస్ స్టేషన్‌లో 2019 ఆగస్టు 8న క్రైమ్ నెం. 367/2019గా నమోదు చేసిన ఈ కేసులో, వివాహానంతరం అదనపు కట్నం కోసం భార్య శ్రావణిని వేధింపులకు గురిచేయడంతో పాటు, ఆమె అనుమానాస్పద మృతికి కారణమైనట్లు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సేకరించిన బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో సమర్పించగా, కేసు విచారణ పూర్తయింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలోని ప్రధాన జిల్లా, సెషన్స్ న్యాయస్థానం ఎస్.సి. నెం.79/2021లో గురువారం తీర్పు వెలువరించింది. నిందితుడు కుంచాల రామాంజనేయులు (32), రాజ్‌సుఖ్ నగర్ కాలనీ, నాగారం, కీసర మండలం నివాసి, వృత్తిరీత్యా మేస్త్రీగా పనిచేస్తుండగా, అతడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ కేసు దర్యాప్తును అప్పటి ఏసీపీ కె. శివకుమార్ (ప్రస్తుతం అదనపు డీసీపీ–అడ్మిన్, మల్కాజిగిరి కమిషనరేట్) సమర్థవంతంగా నిర్వహించి, నిందితుడికి శిక్ష పడేలా పటిష్ఠమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డేవిడ్ రాబర్ట్సన్, కోర్టు కానిస్టేబుల్ రవితేజ, సమన్స్ అధికారి డి. భాస్కర్, లైజన్ అధికారి పి.డి. దివిరాజు, మానిటరింగ్ అధికారి పి. నరసింహారెడ్డి సమన్వయంతో పనిచేశారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారి, ప్రాసిక్యూషన్ బృందం, కేసు విచారణలో సహకరించిన పోలీసు సిబ్బందిని మల్కాజిగిరి డీసీపీ సి.హెచ్. శ్రీధర్, ఐపీఎస్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!