Monday, October 5, 2026
Homeమేడ్చల్ జిల్లావికసిత్ భారత్‌కు మాదకద్రవ్యాల రహిత యువతే...

వికసిత్ భారత్‌కు మాదకద్రవ్యాల రహిత యువతే బలం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా “వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ” జిల్లా స్థాయి పోటీలు శుక్రవారం కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని MY Bharat సంస్థ నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.జానపద నృత్యం, జానపద సంగీతం, నుక్కడ్ నాటక్, చిత్రలేఖనం, వాదోపవాదం, నినాద రచన తదితర విభాగాల్లో పాల్గొన్న యువత మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ చైర్మన్ సి. గోపాల్ రెడ్డి, డైరెక్టర్ డా. ఏ. రాజి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా MY Bharat డిప్యూటీ డైరెక్టర్ స్నేహల్ ధ్యానేశ్వర్ బసుత్కర్ మాట్లాడుతూ, ప్రతి యువకుడు నషా ముక్త్ భారత్ ఉద్యమానికి రాయబారిగా మారి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీన్లు, హెచ్‌వోడీలు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాహుల్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!