Saturday, August 15, 2026
Homeమేడ్చల్ జిల్లామేడ్చల్ జాతీయ రహదారిపై లారీ-కారు ఢీ..!...

మేడ్చల్ జాతీయ రహదారిపై లారీ-కారు ఢీ..! ప్రాణనష్టం లేక ఊపిరి పీల్చుకున్న స్థానికులు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి-44పై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నా ఎవరికీ గాయాలు కాలేదు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎన్.హెచ్-44పై వేగంగా వస్తున్న ఓ లారీ ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు ఆందోళన చెందారు. అయితే కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతిగ్రస్త వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!