Saturday, October 3, 2026
Homeతెలంగాణరాళ్లకత్వ గ్రామంలో శ్రీ శ్రీ పోచమ్మ...

రాళ్లకత్వ గ్రామంలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఘనంగా

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, రాళ్లకత్వ : రాళ్లకత్వ గ్రామంలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ–శ్రావణ మాసాల్లో నిర్వహించే ఈ ఉత్సవాలకు గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా పోచమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామమంతా భక్తి పారవశ్యంతో కళకళలాడగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలు, ఆభరణాలతో అత్యంత అందంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన పోచమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు, చిన్నారులు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!